డెవిల్ సినిమాని చేయనున్న ప్రభాస్ దర్శకుడు ఎవరంటే

డెవిల్ సినిమాని చేయనున్న ప్రభాస్ దర్శకుడు ఎవరంటే

0
102

టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి చిత్రం ఎంత హిట్ అయిందో తెలిసిందే.. ఈ సినిమా బాలీవుడ్ లో కూడా తెరకెక్కింది, ఈ చిత్రం ద్వారా విజయ్ ఎంతో ఫేమ్ సంపాదించుకుని తర్వాత ఆల్ టైం హిట్ సినిమాలు చేశాడు, ఇక ఈ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

అర్జున్ రెడ్డి సినిమాను అక్కడ బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రీమేక్ చేసిన ఆయన, మరోసారి ఘన విజయాన్ని అందుకున్నాడు.
ఆ తరువాత అక్కడే ఆయన రణ్ బీర్ కపూర్ కోసం ఒక కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమాకి డెవిల్ అనే టైటిల్ ను కూడా ఖరారు చేసుకున్నాడు. కాని ఇప్పుడు రణబీర్ ఈ చిత్రాన్ని చేయడానికి ఆసక్తి చూపించడం లేదట.

దాంతో సందీప్ రెడ్డి ఈ కథను ప్రభాస్ కి వినిపించగా, వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా చెబుతున్నారు. అయితే రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న ప్రభాస్ మరో రెండు సినిమాలు అగ్రిమెంట్ చేసుకున్నారట, తర్వాత ఈ చిత్రం చేస్తారు అని తెలుస్తోంది.