చల్లారని “ఆదిపురుష్”‌ వివాదం

-

రామాయణం ఆధారంగా రామునిగా ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్‌ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఆదివారం విడుదలైన సినిమా టీజర్‌పై పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా సన్నివేశాలున్నాయంటూ కొందరు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా సినిమాలోని హనుమంతుడిని చూపించిన విధానం, రావణుడి వేషధారణపై ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి. హిందూ పురాణ పురుషుల్ని తప్పుగా చూపించే విధంగా సన్నివేశాలు ఉన్నాయంటూ ఏకంగా మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా భోపాల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆదిపురుష్‌ చిత్రబృందాన్ని హెచ్చరించటంతో, ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించటం లేదు. హిందూ పురాణ పురుషులను తప్పుగా చూపించే విధంగా ఉన్న సన్నివేషాలను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని చిత్రబృందానికి వార్నింగ్‌ ఇచ్చారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం అయోధ్యలో టీజర్‌ను విడుదల చేశారు. పాత్రలను తప్పుగా చూపించే విధంగా సన్నివేశాలు ఉన్నాయని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, విజువల్‌ ఎఫెక్ట్స్‌ దారుణంగా ఉన్నాయంటూ ట్రోల్స్‌ చేస్తున్నారు. మరి ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని మార్పులు చేస్తారా.. లేదా వీటిపై సినీ బృందం ఏమైనా వివరణ ఇస్తారా అన్నది వేచి చూడాల్సిందే!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Aishwarya Rai | ప్రమాదానికి గురైన ఐశ్వర్య రాయ్ కారు

మార్చి 26 బుధవారం ముంబైలో అందాల నటి ఐశ్వర్య రాయ్(Aishwarya Rai)...

MAD Square | MAD స్క్వేర్ ట్రైలర్‌ రిలీజ్ చేసిన నాగచైతన్య

హీరో అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) బుధవారం MAD Square ట్రైలర్‌...