ప్రభాస్ సినిమాలో కాజల్ ఏం రోల్ చేస్తోందంటే

ప్రభాస్ సినిమాలో కాజల్ ఏం రోల్ చేస్తోందంటే

0
86

ప్రభాస్ సాహో తర్వాత చేస్తున్న సినిమా జాన్, అవును ఇంకా టైటిల్ ఫిక్స్ కాకపోయినా ఇదే సినిమా ఆయన చేస్తున్నారు అనేది తెలిసిందే.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. .పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమా తీస్తున్నారు. అయితే అనుకున్న దానికంటే ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఇటలీలో మెయిన్ షూటింగ్ పూర్తి చేశారు.

ఇక తాజాగా ఈ సినిమా షెడ్యూల్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారు. యూరప్ నేపథ్యానికి సంబంధించిన సెట్స్ ను సిద్ధం చేస్తున్నారు. అయితే అక్కడ సీన్ షూట్ చేద్దాము అనుకున్నా భారీ బడ్జెట్ వల్ల ఈ డెసిషన్ కు వెనక్కి వచ్చారు ..యూరప్ నేటివిటీ వచ్చేలా సెట్ వేయనుంది చిత్రయూనిట్.. ఇక ప్రభాస్ సరసన ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ప్రభాస్ ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు, దీంతో చిత్ర నిర్మాతలు దర్శకులు కూడా ప్రతీ అంశాన్ని జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు, అయితే డార్లింగ్ కు అనుష్క తర్వాత మరో బెస్ట్ ఫ్రెండ్ అంటే కాజల్ అనే చెప్పాలి, అయితే ఆమె కూడా ఇందులో అతిధి పాత్ర చేస్తోందట. గతంలో ప్రభాస్ జోడిగా కాజల్ ‘డార్లింగ్.. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.
జనవరిలో ఆమెకు సంబంధించి షూట్ జరుగుతుంది అని తెలుస్తోంది.