అభిమానులకు మరింత టెన్షన్ పెట్టిస్తున్న ప్రభాస్

అభిమానులకు మరింత టెన్షన్ పెట్టిస్తున్న ప్రభాస్

0
90

సాహోని పూర్తి చేసిన ప్రభాస్ తన కొత్త సినిమా జాన్ అన్ టైటిల్ అనే సినిమా చేస్తున్నారు, అయితే ఇప్పటి వరకూ చేసిన షెడ్యూల లో కేవలం చిత్ర షూటింగ్ 10 పర్సెంట్ మాత్రమే అయిందట.. ఇంకా చిత్ర యూనిట్ మాత్రం పలు సెట్స్ వేసే పనిలో బిజీగా ఉంది.. తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేసి రెడీ గా వుంది… కానీ షూటింగ్ మాత్రం ప్రారంభం కావడం లేదు.

అయితే తొలి షెడ్యూల్ పూర్తి చేసి చాలా రోజులు అయింది.. మరి మళ్లీ ఎందుకు ఇంత లాంగ్ బ్రేక్ అనేది మాత్రం ఎవరికి అర్దం కావడం లేదు ..టాలీవుడ్ లో కూడా ఇదే చర్చ జరుగుతోంది. అంతేకాదు ప్రభాస్ కూడా మళ్లీ మరోసారి విదేశాలకు వెళ్లారు. దీంతో మలి షూటింగ్ కాస్త లేట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు చిత్రయూనిట్.

అయితే ఎందుకు ఈ గ్యాప్ ఇస్తున్నారు అంటే మరోసారి జాన్ సినిమా కథని కాస్త అక్కడక్కడా మార్పులు చేర్పులు చేస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.. అందుకే గ్యాప్ తీసుకున్నారా అని అంటున్నారు.
మరి ఇది ఎంత వరకూ వాస్తవమో చూడాలి . ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ సినిమా అప్ డేట్ గురించి ఎదురుచూస్తున్నారు.