ప్రభాస్ 21వ చిత్రంలో విలన్ ఎవరంటే ?

ప్రభాస్ 21వ చిత్రంలో విలన్ ఎవరంటే ?

0
86

బాహుబలి ప్రభాస్ తో సినిమాలో నటించమంటే ఎవరైనా ఒకే చెబుతారు, ప్రభాస్ తో సినిమా అంటే అది ఇక హిట్ అనే చెప్పాలి, ఇక బాహుబలిలో ఆయనతో పాటు రానాకి కూడా మంచి పేరు వచ్చింది. బళ్లాలదేవగా అదరగొట్టాడు రానా, అయితే తాజాగా మళ్లీ వీరిద్దరూ స్క్రీన్ పంచుకోనున్నారు అని వార్తలు వస్తున్నాయి.

ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తన 20వ చిత్రం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. తరువాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో హాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ లో సోషియో ఫాంటసీ మూవీ చేయడానికి ఓకే చెప్పాడు.
ఇక ఈ స్టోరీ వర్క్ అంతా అశ్విన్ పూర్తి చేశారట.

ప్రభాస్ 21వ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో మొదలు పెట్టి 2022 ఏప్రిల్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు, దాదాపు 350 కోట్ల వరకూ బడ్జెట్ ఉండనుందట.
ఈ చిత్రంలో ప్రభాస్ కు విలన్ గా మరోసారి రానా నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అంతేకాదు ఈ చిత్రంలో హీరోయిన్ గా అలియా లేదా దీపిక అని వార్తలు కూడా వస్తున్నాయి, ఇంకా ఫిక్స్ కావాల్సి ఉంది.