ప్రభాస్ @25..అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది!

0
101

డార్లింగ్ ప్రభాస్ 25వ చిత్రంపై అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది. ముందుగా అనుకున్నట్లుగానే అర్జున్‌రెడ్డి డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లోనే ప్రభాస్‌ నటించనున్నారు. ఈ చిత్రానికి ‘స్పిరిట్‌’ అనే పేరు ఖరారు చేశారు. టీ సిరీస్‌, వంగా పిక్చర్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాయి. భారీ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా 8  భాషల్లో పాన్‌ వరల్డ్‌ స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం.

తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, చైనీస్‌, కొరియన్‌, జపాన్‌ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే బాహుబలి చిత్రంలో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్‌ ఈసారి పాన్‌ వరల్డ్‌ స్టార్‌గా మారనున్నారు. ఇలాంటి అరుదైన  రికార్డ్‌ను సాధించిన తొలి తెలుగు హీరోగా ప్రభాస్‌ నిలవనున్నారు. కాగా ప్రభాస్ ఇప్పటికే సలార్, ఆదిపురుష్ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

https://twitter.com/imvangasandeep