ప్ర‌భాస్ ఆదిపురుష్ సినిమా గురించి స‌రికొత్త విష‌యాలు

ప్ర‌భాస్ ఆదిపురుష్ సినిమా గురించి స‌రికొత్త విష‌యాలు

0
85

టాలీవుడ్ బాహుబ‌లి ప్ర‌భాస్ కొత్త సినిమాలు ఒకే చేస్తున్నారు, రెండు చిత్రాలు ఇప్ప‌టికే ఒకే చేశారు, ఒక‌టి సెట్స్ పై ఉంటే మ‌రొక‌టి సెట్ పైకి వెళ్ల‌నుంది, తాజాగా మ‌రో చిత్రం అనౌన్స్ చేశారు, అదే
ఆదిపురుష్, ఈ సినిమా గురించి ఇప్పుడు దేశ వ్యాప్తంగా చ‌ర్చ న‌డుస్తోంది..సినిమా టైటిల్ పోస్టర్ తోనే విపరీతమైన ఆసక్తి కలుగుతోంది.

ఈ సినిమాకి బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓమ్ రౌత్ దర్శకత్వం వ‌హిస్తున్నారు, ఇక బాలీవుడ్లోకి ప్ర‌భాస్ ఈ చిత్రం ద్వారా నేరుగా ఎంట్రీ ఇస్తున్నారు అనే చెప్పాలి, తాజాగా ఈసినిమా గురించి కొన్ని విష‌యాలు తెలుస్తున్నాయి, అవి ఏమిటో చూద్దాం.

అత్యంత భారీ బడ్జెట్ చిత్రమన్న ప్రచారం జరుగుతోంది, ఈ సినిమా 3డీ ఫార్మాట్ లో తెరకెక్కనుంది. ఆదిపురుష్ ను 5 భారతీయ భాషల్లో రూపొందిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోచేస్తున్నారు, అంతేకాదు విదేశీ భాష‌ల్లో కూడా చేసే అవ‌కాశం ఉంది, ఇక బాహుబ‌లిలో ఎలాంటి పాత్ర చేశారో అలాంటి పాత్ర ఇందులో ప్ర‌భాస్ చేయ‌నున్నారు అని తెలుస్తోంది, 2021 మ‌ధ్య నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. టి సిరీస్, రెట్రో ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఈ చిత్రాన్ని, అలాగే 2022 లో సినిమా రిలీజ్ అవ్వ‌నుంది, ఇక బాలీవుడ్ పాపుల‌ర్ స్టార్ ఇందులో విల‌న్ గా చేసే అవ‌కాశం ఉంది..రామాయణంలోని ఓ ఘట్టం ఆధారంగా ఆదిపురుష్ ని తెర‌కెక్కించ‌నున్నారు.