ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో ఆ టాలీవుడ్ హీరోయిన్ కి ఛాన్స్ ?

ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో ఆ టాలీవుడ్ హీరోయిన్ కి ఛాన్స్ ?

0
83

ప్రభాస్ తాజాగా ఆదిపురుష్ సినిమాని ప్రకటించారు, బాలీవుడ్ దర్శకుడు ఈ చిత్రం తెరకెక్కించనున్నారు, దాదాపు ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తెరకెక్కనుంది, ఈ సినిమాపై ఎంతో క్రేజ్ స్టార్ట్ అయింది, ఇక బాలీవుడ్ లో కూడా దీని గురించి చర్చించుకుంటున్నారు అభిమానులు.

ప్రస్తుతం రాధేశ్యామ్ సెట్స్ పై ఉంది, తర్వాత నాగ్ అశ్విన్ చిత్రం చేయనున్నారు ప్రభాస్, అయితే ఈ సినిమా తర్వాత ఆదిపురుష్ తెరకెక్కే ఛాన్స్ ఉంది అంటున్నారు, ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ టీ-సీరీస్ 350 కోట్ల బడ్జెట్ తో ఐదు భాషల్లో ఈ చిత్రం నిర్మిస్తోంది.

అయితే ఓం రౌత్ దర్శకత్వంలో ఈ భారీ సినిమా ప్లాన్ చేశారు, ఇది పురాణ కథలా తెరకెక్కనుందట, బాహుబలిలో ప్రభాస్ పోషించిన గొప్ప పాత్రలా ఇందులో కూడా ప్రభాస్ చేయనున్నారట, అయితే ఇందులో నటీ నటుల ఎంపికపై ఇప్పటికే దర్శకుడు వర్క్ చేస్తున్నారట, సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

విష్ణు అవతారమైన రాముడి పాత్రను పోలిన పాత్రను ఇందులో ప్రభాస్ పోషిస్తాడని తెలుస్తోంది. అతని సరసన సీతాదేవి వంటి పాత్రను ఎవరు పోషిస్తారనే విషయం ఇప్పుడు అందరిలోనూ కుతూహలాన్ని రేపుతోంది. ఈ సమయంలో ఆ పాత్రకు కీర్తి సురేశ్ ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఆమె కూడా మహానటితో మంచి ఫేమ్ తెచ్చుకుంది, ప్రస్తుతం చేతి నిండా పలు సినిమాలు ఉన్నాయి, ఆమెతో ఇప్పుడు సంప్రదింపులు చేస్తున్నారట, మరి ఇది ఎంత వరకూ వాస్తవమో చూడాలి.