ఆదిపురుష్ – ప్రభాస్ రాముడు మరి సీతగా ఎవరో తెలుసా

ఆదిపురుష్ - ప్రభాస్ రాముడు మరి సీతగా ఎవరో తెలుసా

0
103

ఓమ్ రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ ఆదిపురుష్ సినిమా అనౌన్స్ చేశారు, బాలీవుడ్ నుంచి ఈ సినిమాకి మంచి హైప్ వచ్చింది, పలు భాషల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.. ఇక స్టోరీ లైన్ చూస్తే ఆదిపురుష్. రామాయణం నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రం.. ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు.
మరి ఇక రావణుడిగా సైఫ్ అలీఖాన్ చేయనున్నారు అనేది రివీల్ చేశారు.

ఇక అందరి ఎదురుచూపు మరి సీతగా ఎవరు అని, అయితే ఇప్పటికే క్రూ విషయంలో చిత్ర యూనిట్ చాలా మందితో సంప్రదింపులు జరుపుతోంది, పలు భాషల్లో కాబట్టి అన్నీ చలన చిత్ర పరిశ్రమల నుంచి సీనియర్ నటులని ఎంపిక చేస్తున్నారట.

ఇప్పటికే సీత పాత్రకు గానూ కీర్తి సురేష్, కియారా అద్వాణీ పేర్లు వినిపించాయి. అయితే తాజాగా ఈ పాత్రకు గానూ మరో నటి పేరు వినిపిస్తోంది. ఆమె ఎవరో కాదు అందాల తార, మాజీ మిస్ ఇండియా ఊర్వశి రౌటెలాను , ఆమెని చిత్ర యూనిట్ సీత పాత్ర కోసం సంప్రదిస్తున్నారట.. బ్లాక్ రోజ్ అనే చిత్రంతో తెలుగుకు కూడా పరిచయం అవ్వబోతున్నారు. మరి ఈ మంచి ఛాన్స్ ఆమె కచ్చితంగా చేస్తుంది అంటున్నారు బీ టౌన్ పెద్దలు.