ప్రభాస్ ఆదిపురుష్ టైటిల్ ప్రకటన 7:11 గంటలకే ఎందుకు? ఆ సమయానికి లింక్ ఏమిటి

ప్రభాస్ ఆదిపురుష్ టైటిల్ ప్రకటన 7:11 గంటలకే ఎందుకు? ఆ సమయానికి లింక్ ఏమిటి

0
81

ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ సినిమా ప్రకటించారు, ఈ సినిమా ఐదు భాషల్లో విడుదల కానుంది, ఈ చిత్రం
ఓం రావుత్ దర్శకత్వంలో తెరకెక్కనుంది..ఉదయం 7 గంటలా 11 నిమిషాలకు చిత్రం గురించి ప్రకటించింది చిత్ర యూనిట్ , అయితే ఈ సమయం వెనుక చాలా పెద్ద విషయం ఉంది అని చెబుతున్నారు నెటిజన్లు.

హిందీ , తెలుగు కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తామని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు, అయితే ఈ సమయం వెనుక ఉన్న సంగతి చూస్తే..7.11 అంటే మహావిష్ణువు దశావతారాల్లో శ్రీరాముని అవతారం ఏడవది, ఇక శ్రీరాముడు విల్లు సంధిస్తున్న అంశం కూడా ఇక్కడ టైటిల్ లో కనిపిస్తోంది.

మంచిపై చెడు సాధించిన విజయంఅంటూ క్యాప్షన్ కూడా కనిపిస్తుంది. ఇది రామాయణం కు సంబంధించిన చిత్రం అనే తెలుస్తోంది..శ్రీరాముడు జన్మించి 11 వేల సంవత్సరాలు అయ్యాయని చరిత్రలోని గణాంకాలు చెబుతున్నాయి, అందుకే 7.11 టైమ్ కి దీనిని విడుదల చేశారట. ఈ అంశం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది, అయితే చిత్ర యూనిట్ మాత్రం దీనిపై అలాంటి ప్రకటన చేయలేదు.