ఫ్యాన్స్ కు పూనకాలే..పాన్‌ వరల్డ్‌ మూవీగా ప్రభాస్ ‘ఆదిపురుష్’

Prabhas 'Adipurush' as ​​Panakale..Pan World Movie for Fans

0
304
Adipurush

పాన్ ఇండియా హీరో ప్రభాస్​ వరుస సినిమాలు చేస్తూ కెరీర్​లో దూసుకెళ్తున్నారు. ప్రభాస్ ఇప్పటికే రాధేశ్యామ్  పూర్తి చేయగా..ఆదుపురుష్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇక ఆ తరువాత సందీప్ తో స్పిరిట్ సినిమా చేయనున్నారు. ఇక ఇప్పుడు ఆదిపురుష్ కు సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది.

ఈ సినిమా మొత్తం బడ్జెట్‌ విలువ రూ.400 కోట్లని సమాచారం. దాదాపు 15 స్వదేశీ, అంతర్జాతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 20,000 థియేటర్లలో ఒకేసారి ఈ సినిమా విడుదల కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నెటిజన్లు.. ‘ఆదిపురుష్‌’ని పాన్‌ ఇండియా మూవీగా కాకుండా పాన్‌ వరల్డ్‌ మూవీగా పిలుస్తున్నారు.

భారీ బడ్జెట్‌తో తీస్తున్న ప్రభాస్‌ చిత్రాల్లో ఒకటి ‘ఆదిపురుష్‌’. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామాయణ మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడి పాత్రలో నటించారు. బాలీవుడ్ నటి కృతిసనన్‌ సీత పాత్రలో కనిపించగా, నటుడు సైఫ్‌ అలీఖాన్‌ లంకేశుడిగా కనిపిస్తున్నారు.