ప్రభాస్​ ‘ఆదిపురుష్’ షూటింగ్​ అప్ డేట్

Prabhas 'Adipurush' shooting update

0
93
Adipurush

రెబల్​స్టార్ ప్రభాస్ వరుస సినిమాల షూటింగ్​లతో బిజీగా గడుపుతున్నాడు. భారీ ప్రాజెక్టులతో సిద్ధంగా ఉన్నాడు. ఇందులో ప్రస్తుతం ‘ఆదిపురుష్’, ‘సలార్’ షూటింగ్​లు శరవేగంగా జరుగుతున్నాయి. ‘ఆదిపురుష్’​ను త్రీడీలోనూ తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని ఇప్పటికే వెల్లడించింది చిత్రబృందం. అందుకు తగ్గట్లే షూటింగ్​ను పూర్తి చేసే పనిలో పడింది.

ఈ సినిమాలోని తమ పాత్రలను ఇప్పటికే పూర్తి చేసుకున్నారు రావణ పాత్రధారి సైఫ్ అలీ ఖాన్, సీత పాత్రధారి కృతి సనన్. ఇక ఇందులో రాముడిగా నటించనున్న ప్రభాస్ కు సంబంధించిన షూటింగ్​ను వచ్చే నెలాఖరుకు పూర్తి చేయాలని భావిస్తున్నారు దర్శకుడు ఓంరౌత్.

ప్రోస్ట్ ప్రొడక్షన్​ పనులు ప్రారంభించడానికి ముందే రెబల్​స్టార్​కు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేయాలని భావిస్తున్నాడు. భారీ వీఎఫ్​క్స్​తో రూపొందుతోన్న ఈ సినిమా అనుకున్న సమయానికి థియేటర్లకు రావాలంటే వీలైనంత తొందరగా షూటింగ్ పూర్తి చేయాలని యూనిట్ భావిస్తోంది.