RRRకు పోటీగా… ప్రభాస్, అల్లుఅర్జున్ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ ప్లాన్

RRRకు పోటీగా... ప్రభాస్, అల్లుఅర్జున్ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ ప్లాన్

0
83

ఒకప్పుతు తెలుగు ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా నడిచింది… అయితే ఇప్పుడు మాత్రం మల్టీ స్టారర్ మూవీస్ కు డిమాండ్ బాగా పెరుగుతోంది… ఇప్పటికే మల్టీ స్టారర్ గా వచ్చిన ఎఫ్2, గోపాల గోపాల, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, వెంకీమామ, మనం వంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి…

త్వరలో మరో భారీ మల్టీ స్టారర్ చిత్రం ఆర్ఆర్ ఆర్ రాబోతుంది.. రాస్తవానికి ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది… కానీ కరోనా కారణంగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి కాలేదు… ఇక ఇదే తరహాలో మరో మల్టీస్టారర్ మూవీ రానుందని ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తోంది… పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ ప్లాన్ జరుతోందని వార్తలు వస్తున్నాయి…

ప్రస్తుతం డార్లింగ్ రాధేశ్యామ్ చేస్తున్నాడు… ఆ తర్వాత ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చేస్తున్నాడు… దాని తర్వాత నాగ్ అశ్విన్ తో మరో మూవీ చేయనున్నాడు… ఇక అల్లు అర్జున్ కూడా సుకుమార్ దర్శకత్వంలో పుష్పమూవీ చేస్తున్నాడు… ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నాడు… వీరిద్దరు చేస్తున్న సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత వీరి కాంబినేషల్ లో మల్టీస్టారర్ గా దిల్ రాజు బ్యానర్ లో ఒక మూవీ చేయనున్నారట…

వాస్తవానికి డార్లింగ్ ప్రభాస్ దిల్ రాజు బ్యానర్ లో ఓ మూవీ చేయాలి కానీ అది ఇప్పటివరకు సెట్ కాలేదు.. ఇప్పుడు వీరిద్దరి ప్రాజెక్టులు కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ను ట్రాక్ లో పెట్టనున్నారని వార్తలు వస్తున్నాయి… ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త ఎంత వరకు నిజమో తిలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే…