మళ్ళీ టాప్ స్పాట్ కొట్టేసిన ప్రభాస్..

-

కొన్నేళ్ల క్రితం వరకు తెలుగు ప్రేక్షకులకే హీరోగా పరిచయం ఉన్న ప్రభాస్(Prabhas).. ప్రస్తుతం ప్రపంచమంతా అభిమానులు ఉన్నారు. హాలీవుడ్ హీరోలతో పోటీ పడేలా ప్రభాస్ ఫ్యాన్‌డమ్, క్రేజ్ పెరిగాయి. దానికి తోడు ప్రభాస్ మోగిస్తున్న రికార్డుల మోత దేశవిదేశాల్లో ప్రతిధ్వనిస్తోంది. ప్రతి సినిమాతో బాక్సాఫీస్‌కు చుక్కులు చూపిస్తున్నాడు. వరుసగా తన సినిమాల కలెక్షన్లతో రికార్డులపై రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇటీవల మూవీ టికెట్స్ కొనుగోలు విషయంలో కూడా బాలీవుడ్‌ కా బాద్‌షా అని చెప్పుకునే షారుఖ్ ఖాన్‌ను అధిగమించి తానే బడా డాన్ అని నిరూపించుకున్నాడు. అలాంటిది ఇప్పుడు మరోసారి అందరికంటే తానే మిన్న అని చాటుకున్నాడు. మోస్ట్ పాపులర్ హీరోల జాబితా తీస్తే అందులో ప్రభాస్‌దే ప్రథమ స్థానం.. ఆ తర్వాతే ఇంకెవరైనా. ఆర్మాక్స్(Ormax Media) అనే సంస్థ ఈ జాబితాను సిద్ధం చేసింది. జులై నెలకు సంబంధించి దేశవ్యాప్తంగా పాపులర్ హీరోల లిస్ట్ రెడీ చేసింది. ఇందులో టాప్‌లో ప్రభాస్ పేరు ఉంది. దీనిపై ప్రభాస్ అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ప్రభాస్(Prabhas) తన రేంజ్ చూపించాడంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

- Advertisement -

ఆ తర్వాత స్థానాల్లో షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలను దాటేసి మరోసారి టాప్ పొజిషన్లోనే ప్రభాస్ కొనసాగుతున్నాడు. ఇక రెండో స్థానంలో కోలీవుడ్ విజయ్ దళపతి, నాలుగో స్థానంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu), ఐదో స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), ఏడో స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), తొమ్మిది స్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), పదో స్థానంలో తలా అజిత్ కుమార్ నిలిచారు. మూడు, ఆరు, ఎనిమిది స్థానాల్లో షారుక్, అక్షయ్, సల్మాన్ ఖాన్ ఉన్నారు.

Read Also: నేను పబ్లిక్ ప్రాపర్టీని కాదు: తాప్సీ ఫైర్
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...