తన జిమ్ ట్రైనర్ కు భారీ గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్ – టాలీవుడ్ లో రికార్డ్

తన జిమ్ ట్రైనర్ కు భారీ గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్ - టాలీవుడ్ లో రికార్డ్

0
86

హీరోల గురించి నిత్యం వార్తలు వింటూనే ఉంటాం, అయితే వారి సినిమాల గురించి అనేక వార్తలు అప్ డేట్స్ వింటాం, తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభాస్ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. అది ఏమిటి అంటే.

ఆయన తన పర్సనల్ జిమ్ ట్రైనర్ లక్ష్మణ్ రెడ్డికి రేంజ్ రోవర్ కార్ గిఫ్ట్ గా ఇచ్చాడు అని వార్త వినిపిస్తోంది.. అతని కుటుంబంతో కలిసి కారు దగ్గర ప్రభాస్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది… అయితే ప్రభాస్ కు బాహుబలి సినిమా నుంచి జిమ్ ట్రైనర్ లక్ష్మణ్ రెడ్డి ఆయనతోనే ఉన్నారు.

ఇక సాహో సినిమాకి కూడా ఆయన బరువు తగ్గి కండలు పెంచారు, ఇవన్నీ కూడా లక్ష్మణ్ డైట్ ఫాలో అయ్యేలా చేసి జిమ్ ట్రైనింగ్ చేయించేవాడు, అయితే ఇక ప్రభాస్ 10 కేజీల బరువు తగ్గేలా చేశాడు. ఇప్పుడు రాధేశ్యామ్ చిత్రంలో కూడా ప్రభాస్ లుక్ విషయంలో జిమ్ ట్రైనర్ ఎంతో సాయం చేస్తున్నారు, అయితే ప్రభాస్ అందుకే ఇలా గిఫ్ట్ కొని ఇచ్చారు అని తెలుస్తోంది, టాలీవుడ్ లో ఇంత ఖరీదైన గిఫ్ట్ ఇచ్చింది. ప్రభాస్ మాత్రమే అంటున్నారు అందరూ.