ప్రభాస్ సినిమాపై పెద్ద అప్ డేట్

ప్రభాస్ సినిమాపై పెద్ద అప్ డేట్

0
90

ప్రభాస్ తాజాగా చేస్తున్న సినిమా జాన్ ఇది ఇంకా అన్ టైటిల్.. కాని ఈ సినిమా పేరు మీదనే టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది. మిగిలిన షెడ్యూల్ కి చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి.

ప్రభాస్ కూడా ఒక్కరోజు డిలే లేకుండా షూటింగ్ చేస్తున్నారట, తాజాగా ప్రభాస్ కోసం మరో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు అందులో భాగంగా అన్నపూర్ణ స్టూడియో లో మూడు భారీ సెట్స్ వేశారు అని తెలుస్తోంది.
అయితే అవి ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ అని అంటున్నారు.

ఈ షూటింగ్ విషయంలో ఒక్క పిక్ కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు దర్శకుడు,
అయితే అన్నపూర్ణ లో వేసిన సెట్ లో జనవరి మొదటి వారం నుంచి షూటింగ్ జరుగుతుంది అని చెబుతున్నారు 1960 – 70 కాలం నేపథ్యంలోని ప్రేమ కథాంశంగా ఈ సినిమా వస్తోంది.