ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్, తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్నాడు, సూపర్ హిట్ సినిమాలు చేశాడు, మంచి కథ బలమైన కథనం అయితే ఆ సినిమా చేయడానికి ముందు ఉంటాడు సాయి శ్రీనివాస్, టాలీవుడ్ లో మంచి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు..
తొలి సినిమా అల్లుడు శీనుతోనే మంచి యాక్షన్ హీరోగా పేరు వచ్చింది, అయితే మంచి కథలు రావడంతో అవి సక్సెస్ అయ్యాయి, భారీ బడ్జెట్ చిత్రాలు చేశారు, ఇక స్పీడున్నోడు-జయ జానకి నాయక-రాక్షసుడుచిత్రాలు అతనిలో నటనని బయటపెట్టాయి.
ఇప్పుడు ఆయన తాజాగా అల్లుడు అదుర్స్ చిత్రంలోనటిస్తున్నారు, ఇక తాజాగా ఆయన ప్రభాస్ సినిమాని బాలీవుడ్ లో చేయాలి అని చూస్తున్నాడు అదే ఛత్రపతి సినిమా.. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి హిట్ చిత్రాన్ని
బాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ రీమేక్ చేస్తోంది…. దీనిలో సాయి శ్రీనివాస్ హీరోగా చేయనున్నారు. ఇక డబ్బింగ్ చిత్రాల ద్వారా బీ టౌన్ లో తనకంటూ ప్రత్యేక క్రేజ్ ని సంపాదించుకున్నాడు సాయి శ్రీనివాస్.