ఈ సినిమా రంగం లో పేరు సంపాదించడం ఒక టాస్క్ అయితే వచ్చిన పేరును నిలబెట్టుకోవడం ఇంకా పెద్ద టాస్క్ .. ఇలాంటి టాస్క్ లు గెలిచే హీరోలు చాల అరుదుగా ఉంటారు ..అలంటి వారిలో ప్రభాస్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ..
ఒక్కక్షణం లో కొందరి జీవితాలు మారిపోయినట్టు ..ఒక్క సినిమా తో ఇక్కడ జాతకాలు మారిపోతాయి .. అలంటి బాహుబలి అనే సినిమాకి ప్రాణం పెట్టాడు ప్రభాస్ .. తనుపడిన కష్టానికి ప్రతిఫలం వందరెట్లు వచ్చింది .. తెలుగురాష్ట్రాల హీరో అన్న స్థాయి నుండి తెలుగు సినిమా ఖ్యాతి ని పెంచిన హీరో గ అయన పేరు సంపాదించాడు .. రాజమౌళి అన్న వ్యక్తి పై పెట్టిన నమ్మకం ప్రభాస్ ని సినీ ప్రపంచానికి రారాజు ని చేసింది .
ఆదిపురుష్ అనే ఓ పాన్ ఇండియా మూవీ లో నటిస్తున్న ప్రభాస్ మరో చరిత్రకి శ్రీకారం చుడతాడంటున్నారు అయన అభిమానులు . ఈ మూవీ తో పాటు నాగ్ అశ్విన్ మూవీ మరియు రాధేశ్యాం లాంటి రెండు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు ప్రభాస్