మరో రికార్డ్ సృష్టించిన డార్లింగ్ ప్రభాస్…

మరో రికార్డ్ సృష్టించిన డార్లింగ్ ప్రభాస్...

0
105

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మరో రికార్డ్ ను క్రియేట్ చేశాడు… కాస్త ఆలస్యంగా సోషల్ మీడియా ఫేస్ బుక్ లో ఎంట్రీ ఇచ్చినా ఆదరణలో మాత్రం ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచాడు… ప్రభాస్ ఫేస్ బుక్ ఫాలోవర్ల సంఖ్య 20 మిలియన్స్ చేరుకుంది..

మూడు నెలల క్రితమే 15 మిలియన్ ఫాలోవర్స్ తో బన్నీ క్రాస్ చేసిన ప్రభాస్ ఇప్పుడు 20 మిలియన్ మార్క్ ను దాటేసింది… దీంతో ప్రభాస్ సౌత్ ఇండియాలో అత్యధికంగా ఫాలోవర్లు ఉన్న రికార్డ్ ను సాధించాడు…

కాగా మరో వైపు డార్లింగ్ వరుస చిత్రాలు చేస్తున్నాడు రాధే శ్యామ్ తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ సినిమా చేస్తున్నాడు… అలాగే బాలీవుడ్ లో ఆదిపురుష్ చిత్రం చేస్తున్నాడు… ప్రభాస్ రాముడుగా కపించనున్నఈ చిత్రాన్ని ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు…