ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

0
86

హీరో ప్రభాస్ ఫ్యాన్స్ కొద్ది రోజులుగా మా అభిమాన హీరో చిత్రం గురించి అప్ డేట్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు.. సోషల్ మీడియాలో చిత్ర యూనిట్ ని ప్రశ్నిస్తున్నారు.. తాజాగా రాధాకృష్ణకుమార్ డైరెక్షన్లో యువీ క్రియేషన్స్, గోపీ కృష్ణా మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, అయితే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల అప్ డేట్స్ వచ్చాయి కాని ఈ చిత్రం గురించి ఏ అప్ డేట్ రాలేదు.

ఇటీవల ఈ చిత్ర టీమ్ జార్జియా వెళ్లి కీలక సన్నివేశాల షూటింగ్ని పూర్తి చేసింది. అయినా ఒక్క స్టిల్ వదలలేదు. మరో పక్క డార్లింగ్ ఫ్యాన్స్ మార్చి 25న ఉగాదికి ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ని రిలీజ్ చేస్తారని ఆశగా ఎదురుచూశారు. కాని అలా ఏదీ రిలీజ్ కాలేదు.

తాజాగా యువీ టీమ్ వచ్చే నెల మూడవ వారంలో ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పడానికి సిద్ధమవుతోందట ..టైటిల్తో పాటు ప్రభాస్ ఫస్ట్లుక్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. జాన్, ఓ డియర్, రాధేశ్యామ్ ఈ రెండు టైటిల్స్ లో ఏది ఫైనల్ చేస్తారో చూడాలి