డార్లింగ్ ప్రభాస్ రాధేశ్యామ్ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్నాడు, ఇక ఆదిపురుష్ తన తదుపరి సినిమాల చిత్రీకరణకు రానున్నారు, అయితే ఇక రాధేశ్యామ్ సినిమా యూనిట్ తో కొన్ని నెలలుగా బిజీ షెడ్యూల్ చేశాడు ప్రభాస్.
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. అయితే, సంక్రాంతి సందర్భంగా ప్రభాస్ రాధేశ్యామ్ యూనిట్ సభ్యులను సర్ ప్రైజ్ చేశాడు. అందరికి మంచి ఖరీదైన టైటాన్ వాచీలను బహుమతిగా అందించాడు, ఇప్పటి వరకూ సినిమాకు పనిచేసిన యూనిట్ అందరికి ఈ వాచీలు ఇచ్చారట.
ప్రభాస్ నుంచి ట్రెండీ రిస్ట్ వాచీలను అందుకున్నవారు అందరూ ఫోటోలు షేర్ చేశారు, తమకు చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు, ఇక చిత్ర షూటింగ్ అంతా పూర్తి అయింది పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి, ఇక వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది.