ప్రభాస్ హీరోయిన్ తో మహేష్ బాబు

ప్రభాస్ హీరోయిన్ తో మహేష్ బాబు

0
97

ప్రిన్స్ మహేష్ బాబు తాజాగా దర్శకుడు పరశురామ్ తో సినిమా చేస్తున్నారు అని తెలుస్తోంది, ఇంకా ప్రకటన రాకపోయినా చిత్రానికి సంబంధించి వర్క్ అయితే జరుగుతోందట, కధ పై పూర్తిగా వర్క్ ఫినిష్ చేశారు పరశురామ్, అయితే ఇప్పుడు ఆయన సినిమాలో హీరోయిన్ గురించి చర్చ జరుగుతోంది..

ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేశ్ తో పాటు కొంతమంది కథానాయికల పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా శ్రద్ధా కపూర్ పేరు తెరపైకి వచ్చింది. బాలీవుడ్ లో శ్రద్ధా కపూర్ కి మంచి క్రేజ్ వుంది. తెలుగులో ఆమె ప్రభాస్ సరసన సాహో సినిమా చేసింది. ఈ చిత్రంలో ఆమె నటనకు చాలా ప్రశంసలు వచ్చాయి
తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాతో బాగా దగ్గర అయింది.

అయితే మిల్క్ బాయ్ మన ప్రిన్స్ మహేష్ బాబుకి ఆమె సరైన జోడిగా చిత్రంలో ఉంటారు అని చిత్ర యూనిట్ భావిస్తోందట. పైగా ఈచిత్రం పాన్ ఇండియాలో రూపొందిస్తున్నారు కాబట్టి ఆమె నటిస్తారు అని తెలుస్తోంది..