డార్లింగ్ ప్రభాస్ బాహుబలి సినిమాతో ఓ రేంజ్ లో ఫేమ్ సంపాదించారు, ఇక అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు ప్రభాస్….ఇక ప్రభాస్ లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, షూటింగ్ లేకపోతే ఆయన తన ఫామ్ హౌస్ లోనే ఎక్కువ సేపు సమయం గడుపుతారు.
తాజాగా ప్రభాస్ ఫామ్ హౌజ్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్ శివార్లలో ఉన్న ప్రభాస్ ఫామ్ హౌజ్ ని మరింత అందంగా మారుస్తున్నారట ప్రభాస్ …సరికొత్త మొక్కలతో తన ఫామ్ హౌజ్ గార్డెన్ ను నింపేశాడట. ఇక పలు కొత్త మొక్కలు వేశారట, ఇక దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట దీని కోసం అని వార్తలు బీ టౌన్ లో వినిపిస్తున్నాయి.
ప్రభాస్ లైఫ్ స్టైల్ కు తగ్గట్లుగా మార్చుకున్నాడు ఫామ్ హౌస్ ని… షూటింగ్ లేనప్పుడు ఎక్కువగా అక్కడే కాలక్షేపం చేస్తున్నాడు. ఇక తన ఫ్రెండ్స్ తో కూడా ఎక్కువగా తన ఫామ్ హౌస్ లోనే ఆయన ఉంటారు, ఇక ఆయనకు ప్రకృతి అంటే చాలా ఇష్టం, ఇంటి దగ్గర కూడా ఎక్కువగా మొక్కలు పెంచుతారు, ఇక తాజాగా అటవీ ప్రాంతాలను దత్తత తీసుకున్న ఆయన కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు, కొన్ని మూగజీవాలకు కూడా ఆయన ఫుడ్ కోసం కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారట.