ప్రభాస్ తదుపరి చిత్రం ఆదిపురుష్ ప్రకటన వెలువడిన వెంటనే ఈ సినిమా గురించి అనేక వార్తలు వినిపించాయి, ఎవరు హీరోయిన్ ఎంత మంది హీరోయిన్లు, ఇక ప్రతినాయకుడు ఎవరు ఇలా అనేక రకాల వార్తలు వినిపించాయి, అయితే దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు, అయితే పలు భాషల్లో వస్తోంది కాబట్టి అన్నీ భాషల నుంచి పలువురు సీనియర్ నటులని ఎంపిక చేస్తారు అని తెలుస్తోంది.
ఇక నాగ్ అశ్విన్ చిత్రం తర్వాత ప్రభాస్ ఈ చిత్రం స్టార్ట్ చేయనున్నారు.. ప్రభాస్ కు ప్రతినాయకుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించనున్నాడనే వార్తలు వచ్చాయి. ప్రభాస్ కు జోడీగా కీర్తి సురేశ్ నటించనుందనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ సమయంలో డార్లింగ్ గురించి మరో వార్త వినిపిస్తోంది.
ఈ సినిమా కోసం ప్రభాస్ విలువిద్యను నేర్చుకోబోతున్నాడని తెలుస్తోంది. తన పాత్రకు తగ్గట్టుగా శరీరాకృతిని మార్చుకోవాల్సి ఉంది. విలువిద్యలో ప్రభాస్ కు ట్రైనింగ్ ఇచ్చేందుకు థాయ్ లాండ్ నుంచి శిక్షకుడిని రప్పించే అవకాశం ఉందట, దీని కోసం నెల రోజుల పాటు టైమ్ కేటాయించనున్నారని తెలుస్తోంది.