ప్రభాస్ ఇష్యూ ఇంకా బాధపెడుతోంది..హీరోయిన్ నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్

Prabhas issue is still troubling..heroine Nithyaminan shocking comments

0
114

అందాల ముద్దుగుమ్మ నిత్యామీనన్ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతుంది. అలా మొదలైంది సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

తాజాగా నిత్యామీనన్ ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంది. కెరీర్ బిగినింగ్ లో తనకు తెలుగు రాని సమయంలో తెలుగు హీరోలు కూడా తెలియదట. ఆ సమయంలో ప్రభాస్ ఎవరో తనకు తెలీయదు అని అంది. ఇప్పటికీ ప్రభాస్ ఇష్యునే వెంటాడుతుంది అని అంటుంది నిత్యా. ఈ వ్యవహారాన్ని ఓ జర్నలిస్ట్ పెద్దది చేసి రాసారు. నేను ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా వార్తని సృష్టించారు. అప్పుడే నాకు ఎప్పుడు ఎక్కడ ఎలా వుండాలో అర్థమైంది అని చెప్పుకొచ్చింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లానాయక్ సినిమాలో నిత్యామీనన్ నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఇటీవలే ఈ అమ్మడు నటించిన స్కై ల్యాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించాడు.