ప్రభాస్ జాన్ సినిమా పై కొత్త అప్ డేట్

ప్రభాస్ జాన్ సినిమా పై కొత్త అప్ డేట్

0
117

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలితో మంచి ఫేమ్ సంపాదించారు ..అంతేనా ఆయన సాహో సినిమాతో టాలీవుడ్ రికార్డులు షేక్ చేశాడు, అయితే ఇఫ్పుడు కాస్త గ్యాప్ తీసుకుని, జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ అనే (అన్ టైటిల్ ) సినిమా చేస్తున్నారు.. అయితే ఈ సినిమా గురించి అప్ డేట్స్ చాలా తక్కువ వస్తున్నాయి.. అంతేకాదు ఈ సినిమా గురించి ఎలాంటి వార్తలు సినిమా పరిశ్రమలో చర్చకు రావడం లేదు. అంటే ఎంత సీక్రెసీ నడుస్తుందో అర్ధం చేసుకోవచ్చు.

తాజాగా టాలీవుడ్ లో ప్రభాస్ సినిమా గురించి ఓ కొత్త అప్ డేట్ వచ్చింది, ప్రభాస్ ఈ సినిమాలో బాహుబలి సెంటిమెంట్ తోనే వర్క్ చేస్తున్నారట. ఈ సినిమాలో తండ్రి కొడుకుల పాత్రలో ప్రభాస్ కనపిస్తారట.. తెలుగు, తమిళ, హిందీలో ఈ సినిమా విడుదల చేసేలా ప్లాన్స్ జరుగుతున్నాయి, అలాగే ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇక పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా ప్రభాస్ లుక్ మార్చేయనుంది, ఈ సినిమా కూడా అభిమానులకు పూర్తిస్ధాయి వినోదం అందిస్తుంది అని ఆశలు పెట్టుకున్నారు డార్లింగ్ ఫ్యాన్స్ .