మన తెలుగు హీరోలు ఇప్పుడు హిందీ సినిమాలు చేస్తున్నారు.. నేరుగా ఈ సినిమాలు చేయడంతో వారు ఇటు హైదరాబాద్ నుంచి ముంబై తరచూ ప్రయాణాలు చేస్తున్నారు.. ఇక అక్కడ హోటల్స్ లో ఉండవలసి వస్తోంది.. అందుకే అక్కడ బిజీ షెడ్యూల్స్ ఉన్న వారు చాలా మంది ముంబైలో ఫ్లాట్లు కొంటున్నారు… ఇటీవల రష్మిక కూడా అక్కడ ఓ ఇల్లు తీసుకుంది అని వార్తలు వినిపించాయి.. తాజాగా ఇప్పుడు ముంబైలో ప్రభాస్ ఓ ఇంటి కోసం చూస్తున్నారు అని బీ టౌన్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రభాస్ సలార్ సినిమాతో పాటుగా ఆదిపురుష్ సినిమా కూడా చేస్తున్నారు. ఇక ముంబైలో దాదాపు నాలుగు నుంచి ఐదు నెలలు ఈ చిత్రాలు షూటింగ్ ఉంటాయి… అయితే పలు కథలు కూడా అక్కడ దర్శకులు చెబుతున్నారు… దీంతో ఆయనకు వరుసగా బాలీవుడ్ సినిమాలు రావడంతో అక్కడ కూడా ఇల్లు తీసుకోవాలి అని చూస్తున్నారట.
ప్రతీ నెలలోను పదిహేను రోజుల పాటు ముంబైలో ప్రభాస్ షూటింగులో పాల్గొంటున్నారు, దీంతో అక్కడ ఇల్లు తీసుకోవాలి అని చూస్తున్నారట…బీ టౌన్ లో ఉన్న చాలా మంది ప్రముఖులు ఆయనకు మంచి ఇల్లులు సజెస్ట్ చేస్తున్నారట, తన టీమ్ కి ఈ బాధ్యతలు అప్పచెప్పినట్లు తెలుస్తోంది.
ReplyForward
|