ప్రభాస్ మూవీ ఫస్ట్ లుక్ విడుదలకు డేట్ ఫిక్స్…

ప్రభాస్ మూవీ ఫస్ట్ లుక్ విడుదలకు డేట్ ఫిక్స్...

0
84

యంగ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ పూజా హెగ్దేలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న సంగతి అందరికి తెలిసిందే… ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు… ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు జార్జియాలో మార్కెట్ సెట్ వేసిచిత్రీకరిస్తున్నారు…

అయితే చిత్రీకరణ షూటింగ్ అర్దాంతరంగా ఆపివేసి చిత్ర బృందం అక్కడ నుంచి ఇండియాకు తిరిగి వచ్చేసిందని సమాచారం…కరోనాను కూడా పట్టించుకోకుండా… తాము షూటింగ్ చేస్తున్నామని దర్శకుడు ట్విట్టర్ ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే… మరి ఇప్పుడు ఎందుకు షూటింగ్ ఆపేశారని రకరకాల ప్రశ్నలు వస్తున్న వేళ చిత్ర బృందం దానికి క్లారిటీ ఇచ్చింది…

మార్చి 31 వరకు యూరప్ ఇతర దేశాల నుంచి విమానాలను అనుమతించబోమని భారత ప్రభుత్వం ప్రకటించడంతో అక్కడనుంచి వచ్చామని తెలిపారు.. మరో వైపు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఉగాది సందర్భంగా విడుదల చేయనున్నట్లు సమాచారం…