ప్రభాస్ కోసం రంగంలోకి ప్రత్యేక టీమ్…

ప్రభాస్ కోసం రంగంలోకి ప్రత్యేక టీమ్...

0
101

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ అభిమానులకు కిక్ ఇస్తున్నాడు.. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ ని లైన్ లోపెట్టాడు.. ఈచిత్రాన్ని తన సొంత బ్యానర్ పై నిర్మిసుస్తున్నాడు దీని తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ తో ఒక సినిమా చేయనున్నాడు..

చిత్రం వైజయంతి మూవీస్ పై తెరకెక్కనుంది… ఈ సినిమా కాక ప్రభాస్ బాలీవుడ్ లో కూడా సినిమాను చేస్తున్నారు… సంచలన దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రానికి ఆదిపురుష్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు… ఈచిత్రం రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు… రాముడు పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా రావనుడు పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు…

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక వార్త హల్ చల్ చేస్తోంది… ఈ సినిమా మొత్తాన్ని గ్రీన్ మ్యాట్స్ తోనే షూట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి… ఇలాంటి టెక్నిక్స్ హాలీవుడ్ లో మాత్రమే వాడుతారు.. ఇప్పుడు ఇదే టెక్నిక్స్ ను ఈ సినిమా కోసం వాడుతారట… అవతార్ స్టార్ వార్స్ సినిమాలకి పని చేసిన టీమ్ ఈ సినిమా కోసం పని చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి…