పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మూడు భారీ చిత్రాలు ఒకే చేశారు.. ఇప్పటికే ఈ మూడు సినిమాల్లో రెండు సెట్స్ పై ఉన్నాయి.. సో వచ్చే ఏడాది వరకూ వరుస షూటింగులతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు… అయితే ఇప్పుడు ఇంకా ఆయనకు కథలు చెప్పాలి అని దాదాపు పది మంది దర్శకులు వెయిట్ చేస్తున్నారు.. ఇక బాలీవుడ్ దర్శకులు కూడా ఇద్దరు ప్రభాస్ కు స్టోరీ చెప్పాలి అని చూస్తున్నారట.
కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సలార్ సినిమా చేస్తున్నాడు. అలాగే బాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఇక నాగ్ అశ్విన్ తో మరో సినిమా చేయనున్నారు.. ఈ చిత్రాలు పూర్తి అయిన తర్వాత మరో చిత్రం బాలీవుడ్ లో చేయనున్నారు అని బీ టౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రభాస్ తో సినిమా చేయాలి అని ప్లాన్ చేస్తోందట..ప్రభాస్ తో పాటు హృతిక్ కూడా నటిస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి..ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. మొత్తానికి దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు, కానీ బీ టౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి, దీంతో డార్లింగ్ అభిమానులు చాలా ఆనందంలో ఉన్నారు.
ReplyForward
|