ప్ర‌భాస్ నాగ్ అశ్విన్ సినిమాలో హీరోయిన్ గా ఆమెకి ఛాన్స్ ?

ప్ర‌భాస్ నాగ్ అశ్విన్ సినిమాలో హీరోయిన్ గా ఆమెకి ఛాన్స్ ?

0
91

బాహుబ‌లి సినిమా ద్వారా ప్ర‌భాస్ ఇండియాలో త‌న మార్కెట్ మ‌రింత పెంచుకున్నారు, ఇక వ‌ర‌ల్డ్ వైడ్ ఫ్యాన్స్ కూడా పెరిగారు, అయితే సుజీత్ తో చేసిన సాహో చిత్రం కూడా మంచి ఫేమ్ తెచ్చింది, తాజాగా ప్ర‌భాస్ ‘జిల్’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలోపీరియాడికల్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. తరువాత ప్రభాస్ మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ లో సోషియో ఫాంటసీ మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. ఇక ఇప్ప‌టికే దీనిపై ఓ కీల‌క ప్ర‌క‌ట‌న కూడా చిత్ర యూనిట్ చేసింది.

ఇక ఈ సినిమాలో అంద‌రికి తెలిసిన హీరోయిన్ ని తీసుకోవాలి అని భావిస్తున్నార‌ట‌,
ఇప్పటికే అలియా భట్ ను సంప్రదించగా.. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన నటించాలని ఉన్నా.. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు బ్రహ్మాస్త్ర’ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నందున ఆమెకి కుద‌ర‌డం లేదు, ఇక తాజాగా దీపికా పడుకొనే ను సంప్రదించగా ఆమె ఎస్ చెప్పిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి, ఇక మ‌రి దీనిపై ఇంకా ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది, అక్టోబ‌ర్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవ్వ‌నుందట‌.