ప్ర‌భాస్ కొత్త సినిమా టైటిల్ ఇదేనా

ప్ర‌భాస్ కొత్త సినిమా టైటిల్ ఇదేనా

0
94

ప్రభాస్ కథానాయకుడిగా యూవీ క్రియేషన్స్ వారు సినిమా చేస్తున్నారు ..ఈ సినిమాకి ముందు నుంచి జాన్ అనే టైటిల్ అనుకున్నారు… అయితే తాజాగా ఈ టైటిల్ కాదు అని తెలుస్తోంది… జాను అనే టైటిల్ ఈ మ‌ధ్య శర్వా స‌మంత సినిమా వ‌చ్చింది.. అది దిల్ రాజుకు ఇచ్చేశారు ప్ర‌భాస్ చిత్ర యూనిట్.

అయితే తాజాగా త‌న సినిమాకి యూవీ క్రియేషన్స్ వారు ఓ డియర్ .. రాధేశ్యామ్అనే రెండు టైటిల్స్ ను రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది. దీనిపై బయ‌ట‌కు వార్త‌లు రావ‌డం లేదు కాని ఈ రెండు టైటిల్స్ రిజిస్టర్ అయ్యాయ‌ట‌.

దీని గురించి చిత్ర యూనిట్ ఉగాది రోజున సినిమా పేరు అనౌన్స్ చేయ‌వ‌చ్చు అంటున్నారు, అయితే అందులో ఓ డియ‌ర్ అనే టైటిల్ అంద‌రికి న‌చ్చింది అని తెలుస్తోంది.. ప్రభాస్ .. పూజా హెగ్డే చేస్తున్న ఈ సినిమా ప్రేమకథాంశం కావడం వలన, ఈ సినిమా కోసమే ఆ టైటిల్స్ ను రిజిస్టర్ చేయించారనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. మ‌రి ఉగాది వ‌ర‌కూ ఈ టైటిల్ గురించి వేచి చూడాల్సిందే.