‘ఆర్​ఆర్​ఆర్​’ బ్యానర్​లో ప్రభాస్​ కొత్త సినిమా..రెమ్యునరేషన్ తెలిస్తే షాక్!

Prabhas' new movie under 'RRR' banner..Shock if you know the remuneration!

0
106

పాన్ ఇండియా హీరో ప్రభాస్​ వరుస సినిమాలు చేస్తూ కెరీర్​లో దూసుకెళ్తున్నారు. ఇప్పుడు ఆయన మరో భారీ బడ్జెట్​ సినిమాకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఆర్​ఆర్​ఆర్​ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించనున్నట్లు సమాచారం. ఈ మూవీకి ప్రభాస్​ భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు సినీవర్గాల సమాచారం.

ఇప్పటికే సినిమా గురించి చర్చలు కూడా జరిగాయని, ప్రభాస్​ అగ్రీమెంట్​పై సంతకం కూడా చేసేశారని తెలిసింది. ఇందులో భాగంగానే.. నిర్మాత దానయ్య సుమారు రూ.50 కోట్లను అడ్వాన్స్​గా డార్లింగ్​కు ఇచ్చారట. ఇది నిజమో కాదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

ప్రభాస్ ఇప్పటికే రాధేశ్యామ్  పూర్తి చేయగా..ఆదుపురుష్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇక ఆ తరువాత సందీప్ తో స్పిరిట్,  డైరెక్టర్​ మారుతి ఓ హారర్‌ కామెడీ చిత్రాన్ని తీయనున్నారని.. దానికి ‘రాజా డీలక్స్‌’ టైటిల్​ కూడా ఖరారు చేశారని ప్రచారం సాగుతోంది. ఈ మూవీనే డీవీవీ దానయ్య నిర్మించే అవకాశం ఉందని అంతా మాట్లాడుకుంటున్నారు.