ప్రభాస్ తరువాతి సినిమా ఇదే..!

ప్రభాస్ తరువాతి సినిమా ఇదే..!

0
82

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తరువాత నటించిన సాహో మరో ఫ్యాన్ ఇండియన్ మూవీగా నేడు ( అగస్టు 30) బారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. శ్రద్ద కపూర్ ప్రభాస్ హీరో హీరోయిన్లుగా సుజిత్ తర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలో జాకిష్రాప్,మందిరా బేడి, నీల్ నితిన్ ముఖేష్, తదితర తారాగనం ముఖ్య పాత్రలు పోషించారు.
ఈ చిత్ర ప్రమోషన్‌లో డార్లింగ్ పలు అసక్తికర ప్రశ్నలు ఎదుర్కొన్నాడు.

తాజాగా ఒక ఇంటర్వూలో మాట్లాడుతూ తను చేయబోయే తరువాయి సినిమా గురించిన విషయం బయట పెట్టాడు ప్రభాస్. తన తరువాతి మూవీ ఎలా ఉండబోతోంది.. అది లవ్ స్టోరీనా.. అన్న ప్రశ్నకు సమాధానంగా.. అది 1960 నాటి యూరప్ నేపథ్యంలో నడిచే ఒక వెరైటీ లవ్ స్టోరి. ఈ ప్రేమకథ ఇంతవరకు ఇండియన్ సినిమాలో రానంత కొత్తగా, ఆసక్తికరంగా ఉంటుదని చెప్పారు.

మొత్తానికి ప్రభాస్ ఒక పీరియడ్ ప్రేమకథ చిత్రం చేయబోతున్నారు అని తెలుస్తుంది. కాగా ఈ సినిమాకి రాధాకృష్ణ దర్షకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఇరవై రొజుల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చెసంవత్సరంలో ప్రేక్షకుల ముదుకు రానుంది.