ప్రభాస్ ఎన్టీఆర్ మహేష్ బాబుతో ఆ దర్శకుడు కొత్త సినిమాలు

ప్రభాస్ ఎన్టీఆర్ మహేష్ బాబుతో ఆ దర్శకుడు కొత్త సినిమాలు

0
116

ఒక్క సినిమా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు.. అవును హీరో దర్శకుడు అందరి ఫేమ్ మారిపోతుంది, అయితే కంటెంట్ ఉండాలే కాని సినిమా కచ్చితంగా తెరపై ఆడుతుంది. దానికి సాక్ష్యం కేజీ ఎఫ్ అని చెప్పాలి.

కే జీఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ మొత్తం మీద తెలుగు సినిమాలు చేతిలోకి తెచ్చేసుకున్నారు.. ఆయన తెలుగులో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు చేయడానికి ప్లాన్ రెడీ చేసేసుకున్నారు. వినడానికి ఆశ్చర్యం అనిపించినా ఇది వాస్తవం అంటున్నారు.

అయితే ఆయన ప్రభాస్ తో ఎన్టీఆర్ తో మహేష్ బాబుతో సినిమాలు చేయనున్నారట ముందు ఎవరితో సినిమా చేస్తారో తెలియదు కాని కమిట్మెంట్ అయితే ఉంది అని తెలుస్తోంది… 2020 డిసెంబర్ లో తొలి సినిమా స్టార్ చేస్తారట.. అయితే ఇంకా వీరి ముగ్గురిలో ముందు ఎవరితో అనేది మాత్రం ఇంకా తెలియ్సాలి ఉంది.

ముందుగా ఎన్టీఆర్ తో, తరువాత మహేష్ తో, ఆ పైన ప్రభాస్ తో సినిమాలు వుంటాయని అంటున్నారు, మరి మైత్రీ సంస్ధ ఈ సినిమా నిర్మించాలి అని చూస్తోంది.