ప్రభాస్ ‘రాధేశ్యామ్’ టీజర్​ వచ్చేసిందోచ్..!

Prabhas 'Radheshyam' teaser arrives ..!

0
95

డార్లింగ్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ టీజర్​ వచ్చేసింది. నేడు ప్రభాస్ పుట్టినరోజు కానుకగా  ఈ టీజర్ రిలీజ్​ చేశారు. టీజర్ ఆధ్యాంతం ఆసక్తి రేకెత్తించేలా ఉంది.

టీజర్ చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి

https://youtu.be/s3s0XVBq1zE

1970ల నాటి వింటేజ్ ప్రేమకథతో ‘రాధేశ్యామ్’ సినిమా తీశారు. ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్​గా నటించింది. జగపతిబాబు, భాగ్యశ్రీ, ప్రియదర్శి, జయరామ్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. దక్షిణాది ప్రేక్షకుల కోసం జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. రాధాకృష్ణ దర్శకత్వం వహించారు.

ఇప్పటికే విడుదల స్టిల్స్, పోస్టర్స్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుందీ ‘రాధేశ్యామ్’ ‘బాహుబలి’తో ఎన్నో రికార్డులు నెలకొల్పిన ప్రభాస్.. ఈ సినిమాతో ఇంకెన్ని ఘనతలు సాధిస్తారో చూడాలి.