ప్రభాస్ రెమ్యునరేషన్ వింటే షాక్ సౌత్ ఇండియాలో టాప్

ప్రభాస్ రెమ్యునరేషన్ వింటే షాక్ సౌత్ ఇండియాలో టాప్

0
94

తాజాగా ప్రభాస్ మూవీ సెట్స్ పై ఉంది… అయితే మరో సినిమాని కూడా ప్రకటించేశారు ప్రభాస్ ..
దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్రభాస్ ఓ సినిమా అనౌన్స్ చేశారు, ఈ చిత్రం ప్రముఖ నిర్మాణ సంస్ధ వైజయంతీ మూవీస్ తీయనుంది, అంతేకాదు ఈ చిత్రాన్ని సైన్స్ ఫిక్షన్ కథనంతో తెరకెక్కించనున్నారట..

అయితే ఈ సినిమాపై ఇప్పుడు అనేక వార్తలు వినిపిస్తున్నాయి.. టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ నుంచి కొందరు నటులని తీసుకుంటారట, ఈ చిత్రానికి మొత్తంగా 400 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటుంది అని తెలుస్తోంది, ఇక ఫుల్ గ్రీన్ మ్యాట్ లో 75 శాతం చిత్రం షూటింగ్ ఉంటుంది అని అంటున్నారు, గ్రాఫిక్స్ వీఎఫ్ ఎక్స్ కి చాలా సమయం తీసుకుంటుంది అంటున్నారు.

దాదాపు సినిమా ప్రారంభించిన సంవత్సరన్నర తర్వాత విడుదల అవుతుంది అంటున్నారు పాన్ ఇండియా సినిమా కావడంతో షేర్ కూడా బాగుంటుంది అని నమ్మకం కూడా ఉంది, ఇక ఈ సినిమాకి ప్రభాస్ కు ఏకంగా 70 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మార్కెట్లో కొన్ని ఏరియాల డిస్టిబ్యూషన్ కూడా ఆయన సంస్ధకు ఇవ్వనున్నారట.. వెరసీ ఆయనకు 100 కోట్లు వస్తుంది అని చెబుతున్నారు, ఇక బాహుబలిని మించిన రెమ్యునరేషన్ అంటున్నారు టాలీవుడ్ అనలిస్టులు.