రెమ్యునరేషన్ లో ఇండియాలో ప్రభాస్ సరికొత్త రికార్డ్

రెమ్యునరేషన్ లో ఇండియాలో ప్రభాస్ సరికొత్త రికార్డ్

0
84

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో అగ్రహీరోగా పాన్ ఇండియా స్టార్ అయ్యారు..
అంతేకాదు ప్రభాస్ ఇప్పుడు ఏ సినిమాలు చేసినా అవి పలు భాషాల్లోకి డబ్బింగ్ అవుతున్నాయి. బాహుబాలి తరువాత ప్రభాస్ చేసిన సాహో సినిమా హిట్ అయింది , అయితే ఇప్పుడు ఆయన దర్శకుడు నాగ్ అశ్విన్ తో సినిమా చేయనున్నారు,

ఇక ఈ సినిమాకి భారీగా ప్రభాస్ కు రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు అని తెలుస్తోంది.ప్రభాస్కు 100 కోట్లు ముట్టనున్నట్లు తెలుస్తోంది. సినిమాకు ఇచ్చేది రూ. 70 కోట్లు కాగా, డబ్బింగ్ రైట్స్ కోసం మరో రూ. 30 కోట్లు ప్రభాస్కు ఇవ్వనున్నారని టాలీవుడ్ టాక్ నడుస్తోంది.

అయితే సౌత్ ఇండియాలో ఇంత భారీ స్ధాయిలో సూపర్ స్టార్ రజనీకాంత్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.. ఆయన దర్బార్ చిత్రానికి 70 కోట్లు తీసుకున్నారట, అయితే ఇప్పుడు ఆ రికార్డ్ కూడా ప్రభాస్ దాటేశారు అని అంటున్నారు.

భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా రికార్డు సృష్టించనున్నారు. ప్రభాస్ తాజా సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటించనుంది. ఇక రాధేశ్యామ్ చిత్రం తర్వాత ఈసినిమా స్టార్ట్ అవ్వనుంది.