240 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటున్న ప్రభాస్ దేశంలో రికార్డ్

240 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటున్న ప్రభాస్ దేశంలో రికార్డ్

0
100

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు హీరో ప్రభాస్, అయితే కూల్ గా ఉండే ప్రభాస్ అంటే అభిమానులకు చాలా ఇష్టం, ఈ ఏడాది వరుసగా మూడు సినిమాలు అనౌన్స్ చేశాడు ప్రభాస్.. ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది, ఇక బాహుబలి తర్వాత సాహో హిట్ అయింది, ఈ సినిమా తర్వాత రాధేశ్యామ్ చిత్రం చేస్తున్నాడు.

జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా సెట్స్ పై ఉంది, ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ సినిమా తెరకెక్కనుంది.సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో పూర్తి విభిన్నమైన కథతో ప్రభాస్ ఆ సినిమా చేస్తున్నాడు.

ఇక తాజాగా ఆదిపురుష్ సినిమాని అనౌన్స్ చేశారు…ప్రభాస్. తానాజీ ఫేం ఓంరౌత్ దర్శకత్వంలో ఎ-ఆదిపురుష్ సినిమాలో నటించబోతున్నాడు. వరుసగా ఈ మూడు సినిమాలతో పాన్ ఇండియాలో మూడు చిత్రాలు రిలీజ్ చేయనున్నారు, అయితే ఈ సినిమాలకు ప్రభాస్ భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట.

రాథే శ్యామ్ తర్వాత ప్రభాస్ – దీపిక- నాగ్ అశ్విన్ సినిమా.. ఆ తర్వాత ఆది పురుష్ ఈ మూడు సినిమాలకి ప్రభాస్ దాదాపుగా 240 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని తెలుస్తోంది. ఒక్కో సినిమాకి ప్రభాస్ కి దాదాపుగా 80 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడు అని తెలుస్తోంది. తాజాగా సౌత్ లోనే కాదు ఇండియాలో ఇది రికార్డ్ అంటున్నారు బీ టౌన్ పెద్దలు.