అప్పుడే లో అమెజాన్ లోకి ప్రభాస్ సాహో..!!

అప్పుడే లో అమెజాన్ లోకి ప్రభాస్ సాహో..!!

0
96

బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఏ రేంజ్ లో పెరిగిందో అందరికి తెలిసిందే.. అందుకే అయన నటించిన సాహో చిత్రంపై అంత హైప్ వచ్చింది.. సినిమా ఎలా ఉన్న ప్రభాస్ స్టామినా తో నే ఆ సినిమా కలెక్షన్స్ అన్ని కొల్లగొట్టాయి.

ఇదిలా ఉంటె ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ 42 కోట్ల రూపాయలకు కొన్నది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా ఈ నెల 19 నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది.

అయితే.. ఈ సినిమా హిందీ వెర్షన్ హక్కులను మాత్రం నెట్‌ఫ్లిక్స్‌కు అమ్మారు. డైరెక్ట్ రిలీజ్‌లో కూడా హిందీ వెర్షన్ 100 కోట్ల పైగా వసూలు చేసింది. అయితే నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుందో ఇంకా తెలియరాలేదు.