ప్రభాస్ కు సాహో కథ ఎప్పుడు చెప్పాడో తెలుసా..?

ప్రభాస్ కు సాహో కథ ఎప్పుడు చెప్పాడో తెలుసా..?

0
76

రన్ రాజా రన్ చిత్రం తో వెండితెర కు డైరెక్టర్ గా పరిచమైన సుజిత్ ..మొదటి సినిమాతోనే ప్రేక్షకులను.ఇండస్ట్రీ ని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ప్రభాస్ కు సాహో కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ మూవీ ఆగస్టు 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మీడియా తో మాట్లాడిన సుజిత్ సినిమా కథ ను ఎప్పుడు ప్రభాస్ చెప్పాడో..సినిమా ఆలస్యానికి కారణాలు ఏంటి అనేది చెప్పుకొచ్చారు.

”ప్రభాస్‌ని హీరోగా ఎవరూ ఎంచుకోలేరు. ఆయన దర్శకుడ్ని ఎంచుకోవాల్సిందే. ‘సాహో’ కథ నచ్చడం వల్లే నా డైరెక్షన్‌లో నటిస్తున్నారు అనుకుంటున్నా. ఆయనంటే నాకు చాలా ఇష్టం. దానికి తగ్గట్టే కథ సిద్ధం చేశా. దర్శకుడిగా అనేక సవాళ్లు ఎదుర్కొన్నా. ప్రతీ పాట ప్రత్యేకంగా ఉండాలనుకున్నాం. చిత్ర బృందం మొత్తం చాలా కష్టపడ్డాం. ‘బాహుబలి’ కంటే ముందే ప్రభాస్‌కు ‘సాహో’ కథ చెప్పా. ‘బాహుబలి’ వల్ల ఈ సినిమా కథలో ఎలాంటి మార్పులు చేయలేదు’ అని తెలిపారు.

ఇక ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా శ్రద్ద కపూర్ నటిస్తుండగా..నీల్‌ నితిన్‌ ముకేష్‌, వెన్నెల కిశోర్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ, చుంకీ పాండే తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల కాబోతోంది.