Salaar Release Trailer | దుమ్మురేపుతున్న ‘సలార్- సీజ్ ఫైర్’ రిలీజ్ ట్రైలర్

-

Salaar Release Trailer | ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్న ‘సలార్- సీజ్ ఫైర్’ థియేట్రికల్ ట్రైలర్ వచ్చేసింది. పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన ట్రైలర్ ఎట్టకేలకు విడులైంది. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకోగా.. తాజా ట్రైలర్ కూడా గూస్ బంప్స్ తెచ్చేలా ఉంది. మెకానిక్‌గా పనిచేసే ప్రభాస్(Prabhas).. తన స్నేహితుడు పృథ్వీరాజ్ కోసం ‘ఖాన్సారా’లోకి అడుగుపెట్టి ఎలా విజయం సాధించాడని చూపించారు. ట్రైలర్ చివర్లో ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధశత్రువులుగా మారడమే ఖాన్సార్ కథను మార్చింది అంటూ చెప్పే డైలాగ్ సినిమాపై మరింత హైప్ తెచ్చి పెట్టింది.

- Advertisement -

Salaar Release Trailer | ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీకి A సర్టిఫికెట్ కూడా లభించింది. ఇందులో శృతిహాసన్(Shruti Haasan), పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, టినూ ఆనంద్, ఈశ్వరీరావు, శ్రియా రెడ్డి, గరుడ రామ్ కీలక పాత్రలు పోషించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. రిలీజ్‌కు మరో నాలుగు రోజులు మాత్రమే ఉండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది.

Read Also: హైదరాబాద్‌లో పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ ఫ్యాన్స్ రచ్చ.. పోలీసులు సీరియస్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ys Avinash Reddy | వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డికి ఊరట

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్...

Mudragada | ముద్రగడకు ఊహించని షాక్.. పవన్ కల్యాణ్‌కు కూతురు మద్దతు

ఏపీ రాజకీయాలు రోజురోజుకు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఓవైపు ఎండలు మండిపోతుంటే.. మరోవైపు...