ప్రభాస్ కెరియర్లో వర్షం సినిమా ఎంత సూపర్ హిట్ సినిమానో తెలిసిందే… ఈ సినిమా నిర్మాత ఎమ్ ఎస్ రాజు.. అయితే టాలీవుడ్ లో చాలా మంది నటులు ఇప్పటికీ ఎంతో సన్నిహితంగా ఉంటారు.. ముఖ్యంగా ప్రభాస్ కు వర్షం మంచి సక్సెస్ ఇచ్చింది… అయితే తాజాగా నిర్మాత ఎమ్ ఎస్ రాజు కుమారుడు టాలీవుడ్ యంగ్ హీరో సుమంత్ అశ్విన్ ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే.
ఫిబ్రవరి 13న వివాహం చేసుకున్నాడు, ఇరు కుటుంబ సభ్యులు టాలీవుడ్ లో కొందరు ప్రముఖలు మాత్రమే హాజరయ్యారు, ఇక దీపిక అనే యువతి మెడలో మూడు ముళ్లు వేశాడు… ఇక ఈ జంటకు టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెస్ అందించారు.
తాజాగా ప్రభాస్ సుమంత్కు పెళ్లి శుభాకాంక్షలు చెప్తూ ప్రత్యేక బహుమతి పంపాడు. ఓ పూల బుకెతో పాటు గిఫ్ట్ హ్యాంపర్ పంపించారు ఆయన….తన కుమారుడికి బెస్ట్ విషెస్ ప్రభాస్ అందించారు అని నిర్మాత ఎమ్ఎస్ రాజు ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా తెలిపారు. ఇక ప్రభాస్ నటించిన వర్షం పౌర్ణమి సినిమాలు ఆయన నిర్మించిన విషయం తెలిసిందే
#Prabhas sends gifts to #SumanthAshwin, wishing on his marriage with Deepika.
Thank You for ur wishes Darling ❤️ pic.twitter.com/PVx14g9YGb
— MS Raju (@MSRajuOfficial) February 17, 2021