సినిమా పరిశ్రమలోకి ప్రభాస్ సోదరి ఎంట్రీ – ఏం చేయనున్నారంటే?

సినిమా పరిశ్రమలోకి ప్రభాస్ సోదరి ఎంట్రీ - ఏం చేయనున్నారంటే?

0
87

సినిమా పరిశ్రమలో ఉన్నారు అంటే వారి కుటుంబం నుంచి పిల్లలు కచ్చితంగా పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తారు, హీరో లేదా హీరోయిన్ లేదా దర్శకుడు నిర్మాత ఇలా ఏదో ఓ విధంగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడతారు, తమ సత్తా నిరూపించుకుంటారు.

అయితే ఈమధ్య చాలా వరకూ హీరోలు వారి పిల్లలు అలాగే ఆ హీరోల సోదరులు కూడా చిత్ర పరిశ్రమలోకి వస్తున్నారు, తాజాగా కృష్ణంరాజు కుటుంబం నుంచి ప్రభాస్ వచ్చిన సంగతి తెలిసిందే వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు బాహుబలి.

తాజాగా ఆయన సోదరి కూడా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టబోతున్నారు..ఇప్పుడు కృష్ణంరాజు పెద్ద కుమార్తె ప్రసీద ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేయబోతున్నారు. నిర్మాతగా ఆమె అడుగుపెట్టనున్నారు.
ప్రభాస్ 20వ చిత్రం ‘రాధే శ్యామ్ నిర్మాతల్లో ఆమె కూడా ఒక నిర్మాత . అలాగే త్వరలో ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టే యోచనలో ప్రసీద ఉన్నారట. దీని గురించి త్వరలోనే ఓ ప్రకటన అయితే రానుంది అంటున్నారు టాలీవుడ్ పెద్దలు.