ప్రభాస్ చిత్రంలో అతని చెల్లిగా ఆ బ్యూటీకి ఛాన్స్

ప్రభాస్ చిత్రంలో అతని చెల్లిగా ఆ బ్యూటీకి ఛాన్స్

0
77

ప్రభాస్ కు బాహుబలి చిత్రంతో మంచి క్రేజ్ వచ్చింది, పాన్ ఇండియా నుంచి వరల్డ్ వైడ్ అతనికి ఈ చిత్రం మంచి ఫేమ్ తీసుకువచ్చింది, అయితే బాహుబలి తర్వాత సాహో చిత్రం చేశాడు ప్రభాస్, ఇక అన్నీ భారీ బడ్జెట్ చిత్రాలు పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్ చేశాడు ప్రభాస్.

ప్రభాస్ 20వ సినిమాకి సంబంధించిన ఆసక్తికరవార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఏమిటి అంటే? ఎయిర్ టెల్ యాడ్ తో గుర్తింపు సంపాదించుకుంది అందులో నటించిన మోడల్ సశ చేత్రి. ఆమె ప్రభాస్ చిత్రంలో ప్రభాస్ కు చెల్లెలిగా నటిస్తోందని వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే ఈ ప్రాజెక్ట్కి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. చర్చలు కూడా జరిపారట. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది, ఈ చిత్రంలో ఆమె పాత్ర మరింత బాగుంటుందట.పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.