Salaar Teaser | ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. సలార్ టీజర్ అప్‌డేట్

-

Salaar Teaser | ఆదిపురుష్ చిత్ర ఫలితంతో నిరాశలో ఉన్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel) అదిరిపోయ వార్త చెప్పారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్ సినిమా టీజర్(Salaar Teaser) విడుదల తేదీని ప్రకటించారు. టీజర్‌ను జూలై 6న ఉదయం 5:12 నిమిషాలకు రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. హోంబలే బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో శృతిహాసన్‌(Shruti Haasan) హీరోయిన్‌గా నటిస్తుంది. మలయాళ నటుడు పృథ్విరాజ్‌ సుకుమార్‌ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు(Jagapathi Babu) కీలకపాత్ర పోషిస్తున్నాడు. కాగా, ఆదిపురుష్ ఫలితంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. బాహుబలి సీక్వెల్ తర్వాత బ్యాక్‌ టు బ్యాక్ మూడు ఫ్లాపులు రావడంతో ప్రభాస్‌ అభిమానుల బాధ అంతా ఇంతా కాదు. తొలి మూడు రోజుల్లో్ మూడొందల కోట్లుకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా తర్వాత రెండు రోజుల్లో యాభై కోట్లు కూడా వసూల్ చేయలేదు. దాంతో ప్రస్తుతం ప్రభాస్‌ అభిమానులు ఆశలన్నీ సలార్‌ సినిమాపైనే ఉన్నాయి.

- Advertisement -
Read Also:
1. దళపతి విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. నెక్ట్స్‌ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ సినిమా

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...