డార్లింగ్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ ప్రేమలో ఉన్నారనే వార్త గత కొంతకాలంగా వైరల్ అవుతూనే ఉంది. త్వరలో వీరు పెళ్లి చేసుకోనున్నారనే ప్రచారం మరింత జోరందుకుంది. ఇటీవలే సినీ క్రిటిక్ ఉమైర్ సంధు చేసిన ట్విట్టర్ పోస్ట్ అభిమానుల్లో వీరి పెళ్లి వార్తలపై అనుమానాలకు తావిచ్చింది. ప్రభాస్, కృతి ఎంగేజ్మెంట్ మాల్దీవుల్లో జరగనుందంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కాగా, దీనిపై ప్రభాస్ టీమ్ స్పందించింది. ‘ప్రభాస్, కృతి మంచి ఫ్రెండ్స్. మాల్దీవుల్లో వారి ఎంగేజ్మెంట్ జరగనుంది అనే వార్తల్లో నిజంలేదు’ అని ప్రకటించింది. ఆదిపురుష్ లో వీరిద్దరూ జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే.