ప్రభాస్ తో నాగ్ అశ్విన్ సినిమా వైజయంతీ బ్యానర్ లో

ప్రభాస్ తో నాగ్ అశ్విన్ సినిమా వైజయంతీ బ్యానర్ లో

0
117

ప్రభాస్ కథానాయకుడిగా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమా చేస్తారని నిన్నటి వరకూ వార్తలు వచ్చాయి.. కాని తాజాగా ఈ సినిమా ఒకే అయింది అని ప్రకటన వచ్చేసింది వైజయంతీ నుంచి. వైజయంతీ మూవీస్ వారు కొంతసేపటి క్రితం ఈ ప్రాజెక్టును గురించిన అధికారిక ప్రకటన చేస్తూ, ప్రత్యేకమైన పోస్టర్ ను వదిలారు.

అయితే ప్రభాస్ తన నెక్ట్స్ సినిమాగా దీనిని పట్టాలెక్కిస్తారు అని తెలుస్తోంది…ఇప్పటికే నాగ్ అశ్విన్ మహానటి సినిమాతో వైజయంతీ మూవీస్ బ్యానర్ పేరును మరింత పెంచారు. ఈ సినిమాకి వచ్చిన హైప్ అవార్డులు వైజయంతీకి మళ్లీ పునర్వైభవం తీసుకువచ్చాయి అని చెప్పాలి.

ఇక సినిమా చేసిన తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ చాలా టైం తీసుకున్నారు.. ఈ సమయంలో ఏ హీరో కి కథ రాయాలి అని చర్చలు జరిపారు, ఈ సమయంలో కొద్ది రోజులు సీరియస్ గా కథపై దృష్టిపెట్టారు. ఇక ఈ స్టోరీ ప్రభాస్ కు కరెక్ట్ అని భావించారు, వెంటనే చర్చలు జరిపారు ప్రభాస్ తో, అయితే డార్లింగ్ కూడా ఈ కథ నచ్చడంతో ఒకే చెప్పారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ సినిమా అయిన తర్వాత ఈ చిత్రం మొదలు అవుతుంది అని తెలుస్తోంది.