ప్రభాస్ తో రాజమౌళి కొత్త సినిమా ఎప్పుడంటే

ప్రభాస్ తో రాజమౌళి కొత్త సినిమా ఎప్పుడంటే

0
98

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇక చరణ్ తారక్ కూడా తన తదుపరి సినిమాలపై ఫోకస్ చేస్తున్నారు, ఈ సినిమా జూలై లేదా ఆగస్టులో పూర్తి చేసుకుంటుంది అని తెలుస్తోంది. ఇక చరణ్ ఎన్టీఆర్ కి సంబంధించి కీలక షూటింగ్ అంతా పూర్తి అయింది అని తెలుస్తోంది.. వచ్చే నెల వరకూ ఎన్టీఆర్ కి సంబంధించిన షూటింగ్ ఉంటుందని చెబుతున్నారు.

వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ తరువాత ఏ హీరోతో రాజమౌళి సినిమా ఉండనుంది అనే ప్రశ్నకి సమాధానంగా ప్రభాస్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. టాలీవుడ్ లో అందరూ ఇదే చర్చించుకుంటున్నారు.

అయితే ప్రభాస్ ఇప్పటికే రాజమౌళికి చాలా డేట్స్ ఇచ్చి దాదాపు బాహుబలితో తన సినిమా కెరియర్ లో చాలా డేట్స్ ఇచ్చారు.. దాదాపు ఈ రెండు సినిమాలకి ఐదు సంవత్సరాలు కేటాయించారు.. అయితే ప్రభాస్ కూడా తన తాజా చిత్రం పూర్తి అయిన తర్వాత, కుదిరితే పెళ్లి కూడా ఈ గ్యాప్ లో పూర్తి చేస్తారు అని వార్తలు వస్తున్నాయి. దాని తర్వాత జక్కన్నతో సినిమా ఉంటుంది అని తెలుస్తోంది.. 2020 లో ఇది సెట్స్ పైకి వెళుతుందట 2021లో విడుదల అవుతుందట.