‘కేజీఎఫ్​ 2’ ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు చీఫ్​ గెస్ట్​గా పాన్ ఇండియా స్టార్!

0
104

రాకింగ్ స్టార్ యష్ నటించిన తాజా చిత్రం కెజిఎఫ్ 2. ఇప్పటికే సినీ ప్రపంచంలో ఓ ట్రెండ్‌ సెట్‌ చేసింది కేజీఎప్‌ -1. ఇప్పుడు కెజిఎఫ్ చాఫ్టర్ 2 గా తెరకెక్కుతుంది. కాగా ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్ర యూనిట్. తాజాగా ఈ సినిమా నుంచి తుఫాన్ అనే మొదటి లిరికల్ పాట విడుదలైంది. ఫస్ట్ పవర్ ఫుల్ డైలాగ్ తో మొదలైన ఈ సాంగ్ లో ప్రతి బీట్ పవర్ఫుల్ గా ఉంది.

ఈ నేపథ్యంలో త్వరలోనే ప్రీ రిలీజ్​ ఈవెంట్​ను భారీగా నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేస్తుందట. అన్నీ భాషల్లోనూ ప్రత్యేక ఈవెంట్లను నిర్వహించి అక్కడి స్టార్స్​ను చీఫ్​ను గెస్ట్​గా పిలవాలని యోచిస్తుందట. ఇందులో భాగంగానే తెలుగులోనూ స్పెషల్​ ఈవెంట్​ను నిర్వహించి ముఖ్య అతిథిగా పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్​ను పిలిచేందుకు సన్నాహాలు చేస్తుందని తెలిసింది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

కాగా ఈ సినిమాకు రవి బస్రు త్ సంగీతం అందించగా.. శ్రీకృష్ణ పృథ్వి చంద్ర, అరుణ తదితరులు పాడిన ఈ పాట కథానాయకుడి హీరోయిజాన్ని ఎలివేట్ చేసే మాస్ ట్రాక్ అని చెప్పవచ్చు. రామజోగయ్య శాస్త్రి దీనికి సాహిత్యం అందించారు.